తీరు మార్చుకోని కొందరు రెవెన్యూ అధికారులు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Nov 2019 5:16 AM GMT
తీరు మార్చుకోని కొందరు రెవెన్యూ అధికారులు..!

ముఖ్యాంశాలు

  • విసిగివేసారుతున్న సామాన్యప్రజలు
  • ఎమ్మార్వో ఆఫీసులో ఎన్నిసార్లు ఆర్జీలు పెట్టుకున్న పని కావడం లేదని ఆవేదన

అనంతపురం: భూమి పట్టా పేరును ఆన్‌లైన్‌లో ఎక్కించాలని ఎమ్మార్వో ఆఫీసులో ఎన్నిసార్లు వినతులు పెట్టుకున్న పని కావడం లేదని ఓ బాధితుడు కలెక్టర్‌ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. భూమిలో సగం నేను చెప్పిన వ్యక్తికి రాసిస్తే.. ఆన్‌లైన్‌లో వెంటనే ఎక్కించి పట్టాదారు పాసుపుస్తకం ఇస్తానని ఓ వీఆర్వో బెదరింపులకు గురి చేస్తున్నారని బాధితుడు కలెక్టర్‌ ముందు వాపోయాడు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తన సమస్యలను విన్నవించకున్నాడు.

కదిరికి చెందిన ఆలం నవాజ్‌ మాట్లాడుతూ తనకు తండ్రి ఆస్తిలో భాగంగా సర్వే నంబర్‌ 175-4లో 1.02 ఎకరాల భూమి వచ్చిందని తెలిపారు. ఆ భూమి పట్టదారు పాసుపుస్తకం కోసం చాలా సార్లు రెవెన్యూ అధికారులు వినతులు పెట్టుకున్నాని తెలిపారు. అయితే సగం భూమి తాను చెప్పిన వాళ్లకు రాసిస్తేనే పని చేస్తామని వీఆర్వో నరసింహారెడ్డి అన్నారని బాధితుడు ఆరోపించాడు. నీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకో అంటూ ఇబ్బందులకు గురి చేశాడని స్పందన కార్యక్రమంలో బాధితుడు ఆలం నవాజ్‌ మొరపెట్టుకున్నాడు. వెంటనే స్పందించిన కలెక్టర్‌.. కదిరి ఉపతహశీల్దార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అధికారుల పనితీరుపై కలెకర్ట్‌ సత్యనారాయణ మండిపడ్డారు. తక్షణమే సమస్యను పరిష్కరించి తనకు నివేదిక అందించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అక్రమాలకు పాల్పడితే ఉద్యోగం ఊడుతుందని, కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ సత్యనారాయణ హెచ్చరించారు.

Next Story
Share it