'వంశీ' వైసీపీ ఎంట్రీ నేపథ్యంలో.. 'యార్లగడ్డ' ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Nov 2019 2:39 PM ISTముఖ్యాంశాలు
- సీఎం జగన్‌తో భేటీలో వంశీ ప్రస్తావనే రాలేదు
- జగన్‌పై ఇష్టంతోనే రాజకీయాల్లోకి వచ్చాను
- ఆయనకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు
అమరావతి: సీఎం వైఎస్ జగన్‌తో భేటీలో వల్లభనేని వంశీ ప్రస్తావన రాలేదన్నారు గన్నవరం వైసీపీ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు. సీఎం నిర్ణయం ఎలాంటిదైన స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గన్నవరం నియోజకవర్గం సమస్యలు సీఎం జగన్‌కు వివరించానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని మరింత బలోపేతం కోసం నావంతు కృషి చేస్తానని యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. జగన్‌కు నేను పెద్ద అభిమానిని. జగన్‌పై ఇష్టంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. జగన్ కోసమే పని చేస్తాను. సీఎం అయిన నాల్గొవ రోజు ఓటమి పాలైన నాగురించి ఆలోంచిన మంచి వ్యక్తి సీఎం జగన్ అని యార్లగడ్డ వెంకట్రావు కొనియాడారు.
నియోజకవర్గ కార్యకర్తలకు అండగా ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. వంశీ వైసీపీలో ఎప్పుడు చేరతారన్న ప్రశ్నను దాటవేస్తూ.. పార్టీలోకి వచ్చిన తర్వాత ఆలోచన చేద్దామన్నారు. వంశీ ఎప్పుడు వస్తాడన్నది ఆయన్నే ఆడగాలన్నారు. వంశీ ఎమ్మెల్యే వంశీ తననూ ఇప్పటి వరకు కలవలేదన్నారు. వల్లభనేనితో కలిసి పని చేస్తానన్న విషయం తనకు మీడియా ద్వారానే తెలిసిందన్నారు. వంశీ వ్యాఖ్యలపై సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని గన్నవరం వైసీపీ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు.
నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసమే వచ్చానని.. సమస్యలు సృష్టించాడానికి రాలేదన్నారు. ప్రజలకు మంచి చేద్దామనే రాజకీయాల్లోకి వచ్చాననని.. నేను క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని, పార్టీలు మారే ప్రసక్తే లేదని వెంకట్రావు పేర్కొన్నారు. వంశీ ప్రభుత్వ పథకాలకు ఆకర్షించబడ్డాడా.. కేసులకి భయపడ్డాడో ఆయనకే తెలియాలన్నారు. ఇళ్ల పట్టాలని టీడీపీ నేతలు పంచింది వాస్తవం కాదా..? అంటూ వెంకట్రావు ప్రశ్నించారు. ఎన్నికల ముందు దొంగ పట్టాలు పంచారు. వారందరికీ మళ్లీ ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యతనాపై ఉంద్నారు. ఒక వేళ గన్నవరంలో ఉప ఎన్నికలు వస్తే ఎవరు పోటీ అనేది జగన్ నిర్ణయిస్తారన్నారు. సీఎం వైఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకన్న కట్టుబడి పని చేస్తానని గన్నవరం వైసీపీ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు.