జీజీహెచ్‌లో రిమాండ్‌ ఖైదీ మృతి...

By అంజి  Published on  27 Nov 2019 5:58 AM GMT
జీజీహెచ్‌లో రిమాండ్‌ ఖైదీ మృతి...

తూర్పుగోదావరి: రాజేమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీ నమ్మి ఉమా వెంకట దుర్గా వరప్రసాద్‌ (36) మృతి చెందాడు. గత కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న దుర్గా వరప్రసాద్‌.. ఓ కేసుకు సంబంధించి జూన్‌ 13 నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. దుర్గా వరప్రసాద్‌ ఆరోగ్యాన్ని గమనించిన జైలు సిబ్బంది ఇటీవలే జీజీహెచ్‌కు ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 25న నుంచి వైద్యుల సమక్షంలో దుర్గా వరప్రసాద్‌ చికిత్స పొందుతున్నాడు. కాగా మంగళవారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. చికిత్స పొందుతుండగానే దుర్గా వరప్రసాద్‌ మృతి చెందాడు. ఈ విషయాన్ని జీజీహెచ్‌ ఔట్‌ పోస్టు పోలీసులు తెలిపారు.

Next Story
Share it