జేసీ కుటుంబసభ్యులకు హైకోర్టు నోటీసులు.. కారణం అదే..!

By అంజి  Published on  27 Nov 2019 9:29 AM GMT
జేసీ కుటుంబసభ్యులకు హైకోర్టు నోటీసులు.. కారణం అదే..!

అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. త్రిసూల్‌ సిమెంట్‌ కంపెనీకి లైమ్‌ స్టోన్‌ మైనింగ్‌ లీజు మంజూరు వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌పై జేసీ కుటుంబ సభ్యులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. త్రిసూల్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీని నిర్ణీత సమయంలో నిర్మించలేదని, దానికి కేటాయించిన లైమ్‌ స్టోన్‌ గనులు రద్దు చేయాలన్న పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా లైమ్‌ స్టోన్‌ గనుల లీజు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని కోర్టు నోటీసులో పేర్కొంది. బినామీలతో జేసీ చేస్తున్న దందా చేస్తున్నారని 2011లోనే పిటిషన్‌ వేసినట్లు తాడిపత్రికి చెందిన మురళీ ప్రసాద్‌ రెడ్డి చెప్పారు. తమకు కోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తదుపరి విచారణను హైకోర్టు డిసెంబర్‌ 30కి వాయిదా వేసింది.

Next Story