సింగపూర్‌లో హీట్‌ పుట్టిస్తున్న అమరావతి..!

By అంజి  Published on  28 Nov 2019 6:12 AM GMT
సింగపూర్‌లో హీట్‌ పుట్టిస్తున్న అమరావతి..!

ముఖ్యాంశాలు

  • సింగపూర్‌ రాజకీయాల్లో హాట్‌ టాఫిక్‌గా ఏపీ రాజధాని అమరావతి
  • అమరావతిలో బిలయన్‌ డాలర్లు వృథా చేశారని ప్రతిపక్ష నేత వ్యాఖ్య

సింగపూర్‌ రాజకీయాల్లో ఏపీ రాజధాని అమరావతి హాట్‌ టాఫిక్‌గా మారింది. అమరావతి రాజధాని ప్రాజెక్టు అభివృద్ధికి గత టీడీపీ ప్రభుత్వం సింగపూర్‌ పెట్టుబడి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాము ఏపీలో పెట్టుబడులు పెట్టమని సింగపూర్‌ సంస్థలు వెనక్కి వెళ్లాయి. దీని గురించి ఇప్పటికే రెండు ప్రభుత్వాలు కూడా ప్రకటనలు చేశాయి. ఈ నేపథ్యంలో ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని కొత్త ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పకపోవడం.. రాజధానిని మార్చుతారనే అనుమనాలకు తావిస్తోంది.

దేశవ్యాప్తంగా రాజకీయాల్లో కూడా ఏపీ రాజధాని అమరావతిపై చర్చించుకుంటున్నారు. కాగా సింగపూర్‌లో విపక్ష నేత బ్రాడ్‌ బోయర్‌.. అక్కడి ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ రాజధాని అమరావతిలో సింగపూర్‌ సంస్థలు నాలుగు బిలయన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టాయని... ఆ పెట్టుబడులు బురదలో పోసిన పన్నీరు అయ్యాయని బ్రాడ్‌ బోయర్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో ఆరోపించారు. కాగా బ్రాడ్‌ బోయర్‌ వార్తలను సింగపూర్‌ ప్రభుత్వం ఖండించింది. బ్రాడ్‌ బోయర్‌పై తప్పుడు వార్తల నిరోధక చట్టాన్ని మొదటిసారిగా సింగపూర్‌ ప్రభుత్వం అమలు చేసింది. తప్పుడు, అసత్య వార్తలను నిరోధించేందుకు ఇటీవలే సింగపూర్‌ ప్రభుత్వం ప్రొటెక్షన్‌ ఫ్రమ్‌ ఆన్‌లైన్‌ ఫాల్స్‌హుడ్స్‌ అండ్‌ మానిప్యులేషన్‌ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. తక్షణమే ఆ పోస్టును తొలగించాలని బ్రాడ్‌ బోయర్‌కు సింగపూర్‌ ప్రభుత్వం సూచించింది.

కాగా బ్రాడ్‌ బోయర్‌ ఆరోపణలపై సింగపూర్‌ ఆర్థికమంత్రి స్పందించారు. తాము అమరావతి ప్రాజెక్టులో ఇంకా ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని సింగపూర్‌ కన్సార్షియం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. అమరావతి ప్రాజెక్టు రూప కల్పన కోసం కొద్దిమొత్తంలో ఖర్చు చేశామన్న సింగపూర్‌ ఆర్థికమంత్రి... బ్రాడ్‌ బోయర్‌ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. తాజాగా అమరావతిలో నిర్మాణాలను కొనసాగించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

Next Story