ఏపీలో ఉద్యోగాల పండుగ..!

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 29 Oct 2019 1:50 PM

ఏపీలో ఉద్యోగాల పండుగ..!

  • 19,170 వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

అమరావతి: వాన జల్లులు కురిసినట్లు ఏపీలో ఉద్యోగాల జల్లులు కురుస్తున్నాయి. వైఎస్ జగన్ సీఎం అయినప్పటి నుంచి ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. ఏపీ ప్రభుత్వం మరో ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. వార్డు వాలంటీర్ల పోస్ట్‌లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 19,170 పోస్ట్ లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మునిసిపల్ కమిషనర్ విజయ్ కుమార్ పూర్తి వివరాలు అందించారు.

మొత్తం 19,170 వార్డు వాలంటీర్ల ఖాళీలు భర్తీ

నవంబర్ 1 నుండి భర్తీ ప్రక్రియ ప్రారంభం

నవంబర్ 10 వరకు అభ్యర్థులు నుంచి దరఖాస్తులు స్వీకరణ

నవంబర్ 15 వరకు దరఖాస్తులు పరిశీలన

నవంబర్ 16 నుంచి 20 వరకు ఇంటర్వ్యూ లు

నవంబర్‌ 22న ఎంపికయిన వార్డు వాలంటీర్ల జాబితా ప్రకటన

డిసెంబర్ 1నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తి

Next Story