నారా లోకేష్‌కు భద్రత కుదింపు

By సుభాష్  Published on  6 Feb 2020 12:39 PM GMT
నారా లోకేష్‌కు భద్రత కుదింపు

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ప్రభుత్వం షాకిచ్చింది. లోకేష్‌కు భద్రతను కుదిస్తూ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో లోకేష్‌ భద్రతను జడ్‌ కేటగిరి నుంచి వై ప్లస్‌లోకి కుదించగా, తాజాగా వైప్లస్‌ కేటగిరి నుంచి ఎక్స్‌ కేటగిరిలోకి మార్చింది. ఎనిమిది నెలల్లో లోకేష్‌కు భద్రతను కుదించడం ఇది రెండోసారి.

ఉద్దేశపూర్వకంగానే కుదింపు

ఏపీ వైసీపీ సర్కార్‌ ఉద్దేశ పూర్వకంగానే లోకేష్‌కు భద్రతను కుదించిందని టీడీపీ ఆరోపిస్తోంది. గత జూన్‌ నెలలో జడ్‌ కేటగిరి ఉన్న భద్రతను తగ్గిస్తూ 2+2 గన్‌మెన్లను కేటాయిస్తూ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మిగిలిన చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రతను పూర్తిగా తొలగించారు. ఏపీలో ఓటమిపాలైన పలువురు టీడీపీ నేతలకు కూడా భధ్రతను కుదించిన విషయం తెలిసిందే.

ఏపీకి మూడు రాజధానుల ప్రకటన నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతుల ఉద్యమంలో లోకేష్‌ కురుకుగా పాల్గొంటున్నారు. ప్రభుత్వ వైఖరిపై లోకేష్‌ ట్విట్టర్‌ ద్వారా మండిపడుతున్నారు. అందుకే లోకేష్‌ దూకుడుకు ఆడ్డుకట్ట వేసేందుకుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Next Story