అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో కొత్త మిషన్‌ను ప్రారంభించింది. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి బిల్డ్ ఏపీ పేరుతో కొత్త మిషన్‌ను ప్రారంభించింది. ప్రభుత్వ భూములను గుర్తించి భవన సముదాయాలు నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో మిగతా భూముల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్కెట్ ధరకు వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలకు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రభుత్వ భూముల వివరాలు సేకరించాలని కలెక్టర్లకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.