ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం జగన్ సంచలన నిర్ణయం
By సుభాష్ Published on 14 April 2020 7:15 PM ISTఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పాలన పాగ్గాలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. విద్యార్థుల విషయంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
వచ్చే ఏడాది నుంచి విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను జమ చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. త్రైమాసికానికి ఓ విడత చొప్పున తల్లిల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో కళాశాల యజాన్యాలతో పాటు విద్యార్థులకు ఊరట లభించనుంది. అంతేకాదు 2018-19 సంవత్సరానికి సంబంధించి రూ.1800 కోట్ల బకాయిలు చెల్లించామని జగన్ సర్కార్ తెలిపింది.
ఇక విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బులను వెంటనే తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు ఇవ్వాలని కళాశాలలకు ఆదేశాలు జారీ చేసినట్లు జగన్ తెలిపారు.
కాగా, జగనన్న విద్యాదీవెన పథకం కింద ప్రతీ విద్యార్థికి మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయాలని గతంలో జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకం కింద ఐటీఐ విద్యార్థికి సంవత్సరానికి గానూ రూ. 10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థికి రూ. 15వేలు, డిగ్రీ, ఆపై కోర్సుల వారికి రూ. 20 చొప్పున ప్రభుత్వం అందజేస్తోంది.