నిజమెంత: ఏపీ కొత్త ఎలెక్షన్ కమీషనర్ కనగరాజు పాస్టర్ గా పనిచేశారా..?

By సుభాష్  Published on  14 April 2020 11:27 AM GMT
నిజమెంత: ఏపీ కొత్త ఎలెక్షన్ కమీషనర్ కనగరాజు పాస్టర్ గా పనిచేశారా..?

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎలెక్షన్ కమీషనర్ ను నియమించింది. జస్టిస్(రిటైర్డ్) వి.కనగరాజు, ఏప్రిల్ 11 నుండి బాధ్యతలు చేపట్టారు.

ప్రస్తుతం ఆయనకు సంబంధించి ఓ మెసేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఇవాన్జెలికల్ లూథరన్ చర్చి లో 2010 వరకూ పాస్టర్ గా పనిచేశారని, ఇప్పుడు చెవలియర్ టి.థామస్ ఎలిజబెత్ కాలేజీ ఫర్ విమెన్ కు ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేస్తున్నారు. ఓ వర్గం వారు కావాలనే ఈ వార్తను వైరల్ చేస్తూ ఉన్నారు.



సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు:

AP నూతన ఎన్నికల కమిషనర్‌గా తమిళనాడుకు చెందిన రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌ (84)గారు..

గతంలో 2010లో ఈయన తమిళ ఇవాంజిలికల్ లూథరెన్ చర్చ్ నిర్వాహకుడు గా కూడా పనిచేశారు.

ప్రస్తుతం చెన్నైలోని Chevalier T. Thomas Elizabeth College for Women కి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు..

మరొక మెసేజీ:

ఆంధ్రప్రదేశ్‌ నూతన ఎన్నికల కమిషనర్‌గా తమిళనాడుకు చెందిన రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌ (84)ను నియమించింది ఏపీ ప్రభుత్వం.

జస్టిస్‌ కనగరాజ్ గారు మద్రాస్‌ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. 1973 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నారు. 2006లో హైకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారు.

గతంలో (2010) Tamil Evangelical Lutheran Church కి నిర్వాహకుడి (Administrator)గా పనిచేశారు.

ప్రస్తుతం చెన్నైలోని Chevalier T. Thomas Elizabeth College for Women కి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

కనగరాజ్ గారికి అభినందనలు.

నిజమెంత:

పై అభియోగాలన్నీ 'పచ్చి అబద్ధాలు'

Fact Check 1

చెవలియర్ టి.థామస్ ఎలిజబెత్ కాలేజీ ఫర్ విమెన్ అధికారిక వెబ్సైట్ ను న్యూస్ మీటర్ సందర్శించగా ఆ కాలేజీ ఛైర్మన్ పేరు జె.కనకరాజ్, ఆయన కూడా చెన్నై హై కోర్ట్ రిటైర్డ్ జడ్జి. వెబ్సైట్ లో ఉన్న ఛైర్మన్ ఫోటోగ్రాఫ్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కొత్త ఎలెక్షన్ కమీషనర్ ను అసలు సంబంధం లేదు.

అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాస్టర్ ఫోటోలను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఆ ఫొటోల్లో ఉన్న పాస్టర్ పేరు రిటైర్డ్ Rev. S. ఎడ్విన్ జయకుమార్, ది ట్వెల్ఫ్త్ బిషప్ ఆఫ్ ట్రాంక్బర్ గా తమిళ్ ఇవాంజెలికల్ లూథర్న్ చర్చ్(TELC) లో బాధ్యతలు చేపట్టారు. 2014లో ఆయన పవిత్ర పరచబడ్డారు.

స్థానిక తెలుగు మీడియా కూడా ఎస్.ఈ.సి.కనగరాజు పై వచ్చిన వదంతులన్నిటినీ అబద్ధాలని స్పష్టం చేశాయి.

జస్టిస్ కనగరాజుకు సంబంధించిన పూర్తీ ప్రొఫైల్ ను చూడడం జరిగింది ఆయన ఎక్కడ కూడా పాస్టర్ గా పనిచేసినట్లు చెప్పుకోలేదు. అలాగే ఏ ఆర్గనైజేషన్ కు కూడా పనిచేయలేదని చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ కొత్త ఎలెక్షన్ కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన కనగరాజు గతంలో పాస్టర్ కాదు.. చెవలియర్ టి.థామస్ ఎలిజబెత్ కాలేజీ ఫర్ విమెన్ కు ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహించలేదు. ఆయనపైన వచ్చిన అభియోగాలన్నీ అబద్ధం.

Next Story