కరోనా ఎఫెక్ట్‌: జిల్లా ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు..

By అంజి  Published on  21 March 2020 10:58 AM GMT
కరోనా ఎఫెక్ట్‌: జిల్లా ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు..

పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూను ప్రజలందరూ స్వచ్ఛందంగా పాటించాలన్నారు. కర్ఫ్యూ సందర్భంగా ప్రజలకు అత్యవసర సేవలు అందించడానికి పోలీస్ సిబ్బంది అందరూ పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉండవలసిందిగా అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని డీజీపీ తెలిపారు. రేపు ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవుతారు కావున పోలీసలందరూ అప్రమత్తతో ఉంటారని అన్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ ల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇది స్వచ్ఛందంగా ప్రజలు తమకు తాముగా పాటించే కర్ఫ్యూ మాత్రమేనన్నారు. Dail 100 ద్వారా విస్తృతంగా, నిరంతరంగా సేవలు పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఎందుకీ జనతా కర్ఫ్యూ

కరోనా వైరస్ ఒక ప్రదేశంలో సుమారు 12 గంటల వరకు జీవించి ఉంటుంది. జనతా కర్ఫ్యూ 14 గంటలు పాటించడం ద్వారా కరోనా వైరస్ జీవించి ఉన్న ప్రదేశాలను ఎవరు స్పృశించరు. తద్వారా అట్టి గొలుసును ఛేదించడం ద్వారా వైరస్ వ్యాప్తి జరగకుండా నిరోధించడం అనేది ప్రధాన ఉద్దేశం. కావున జనతా కర్ఫ్యూ ని ప్రజలందరూ పాటించాలని ఆయన కోరారు.

ఇక కరోనా ఉధృతి దృష్ట్యా ప్రధాని నరేంద్రమోదీ మార్చి 22, ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ జనతా కర్ఫ్యూ పాటించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో రేపు పెట్రోల్ బంక్ లు మూతపడనున్నాయి. అలాగే ఆంధ్రా నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులు సైతం రద్దయ్యాయి. ఢిల్లీలో మెట్రో సర్వీలు నిలిచిపోనున్నాయి. ఇత మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా మాల్స్, షోరూమ్ లు మూతపడనున్నాయి.

Next Story