ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌న కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 9,831 సాంపిల్స్ ను ప‌రీక్షించ‌గా.. కొత్త‌గా మ‌రో 50 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3427 కి చేరింది. కరోనా వల్ల కృష్ణాలో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఈ మ‌హ‌మ్మారి వల్ల చనిపోయిన వారి సంఖ్య 73కి చేరింది.

మొత్తం న‌మోదు అయిన కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 2,294మంది డిశ్చార్జి కాగా.. 1060మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 123 మందికి కరోనా సోకింది. ఇత‌ర‌ రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 700 మంది కరోనా బారినప‌డినట్లు ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

Untitled 2 Copy

తోట‌ వంశీ కుమార్‌

Next Story