ఏపీలో మరో 48 కరోనా కేసులు
By తోట వంశీ కుమార్ Published on 26 May 2020 11:43 AM ISTఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నా.. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాగాజా గడిచిన 24 గంటల్లో 8,148 మంది సాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా 48 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 2719 కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకూ 1903 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ 57 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 759 మంది కోవిడ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన 48 కేసుల్లో కోయంబేడు కాంటాక్టు కేసులు చిత్తూరు జిల్లాలో నాలుగు ఉన్నాయి.
Also Read
జగన్ సర్కారుకు వెంకన్న భూముల వేలం చిక్కుNext Story