ఏపీలో కొత్తగా 706 పాజిటివ్ కేసులు.. 11 మంది మృతి
By సుభాష్ Published on 29 Jun 2020 2:31 PM ISTఏపీలో కరోనా వైరస్ కాలరాస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. సోమవారం ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 30,216 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 706 మందికి కరోనా పాజిటివ్ తేలింది. రాష్ట్రంలో మొత్తం 793 కేసులు నమోదు కాగా, అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 81 కాగా, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు 6గురు ఉన్నారు.
ఇక ఒకే రోజు 11 మంది మృతి చెందారు. అందులో కర్నూలులో ఐదుగురు, కృష్ణలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విజయనగరంలో ఒకరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు చొప్పున మరణించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కేసుల సంఖ్య 13891 ఉండగా, 7479 మంది యాక్టివ్‌గా ఉన్నారు. ఇక ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 180కి చేరింది.
తాజాగా ఏపీలో 302 మంది కరోనా నుంచి కోలుకు డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం 6232 మంది డిశ్చార్జ్ అయ్యారు.