తిరుమల వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి 27 వరకు జరగనున్నాయి. కరోనా కారణంగా ఈ సారి భక్తులను అనుమతించడంలేదు. ఈ సారి బ్రహోత్సవాలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌తో పాటు, కర్ణాటక సీఎం యడియూరప్ప హాజరుకానున్నారు. సీఎం జగన్‌ రెండు రోజుల పాటు తిరుమలలోనే ఉండనున్నారు. 23వ తేది సాయంత్రం తిరుమలకు సీఎం చేరుకోనున్నారు. ఏటా బ్రహ్మోత్సవాల మొదటిరోజు రాష్ట్రప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది కొవిడ్‌-19 నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ క్రమంలో భక్తులరద్దీ లేని కారణంగా పూర్వసంప్రదాయాన్ని పాటిస్తూ గరుడవాహనం జరిగే 23వ తేదీనే ముఖ్యమంత్రి జగన్‌ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

24న ఉదయం జగన్.. శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనాంతరం నాదనీరాజనం మండపంలో నిర్వహిస్తూన్న సుందరకాండ పారాయణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అనంతరం కర్నాటక అతిధి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో ఇరువురు సీఎంలూ పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి పద్మావతి అతిథి గృహానికి చేరుకుని అల్పాహారం స్వీకరించిన అనంతరం జగన్ తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *