ఏపీ బడ్జెట్ ముఖ్యాంశాలు.. దేనికి ఎంత
By సుభాష్ Published on 16 Jun 2020 8:40 AM GMTఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో మరోసారి సంక్షేమానికి పెద్దపీట వేసింది ఏపీ సర్కార్. 2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో 2020-21వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి. ఆర్థిక మంత్రిగా రెండో సారి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.1,80,392 కోట్ల రెవెన్యూ వ్యయం, 44,396 కోట్ల మూలధన అంచనా వ్యయంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇక సంక్షేమమే లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందని మంత్రి బుగ్గన తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇది చదవండి: అసెంబ్లీ సమావేశాలు: రచ్చకు వేళయేరా..!
బడ్జెట్ వివరాలిలా..
♦ రూ. 2,24,789,18 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్
♦ రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392. కోట్లు
♦ మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లు
♦ ఆరోగ్య రంగానికి రూ.11,419.44 కోట్లు
♦ వ్యవసాయ రంగానికి రూ.11,891 కోట్లు
♦ పశుగాణాభివృద్ధి, మత్స్యరంగానికి రూ.1279.78 కోట్లు
♦ జనవరుల శాఖకు రూ.11,805.74 కోట్లు
♦ గృహ నిర్మాణ రంగానికి రూ. 3,691.79 కోట్లు
♦ హోంశాఖకు రూ.5,988.72 కోట్లు
♦ ఆర్థిక లోటు రూ. 40,493.46 కోట్లు
♦ పెట్టుబడులు, మౌలిక వసతుల రంగానికి రూ.696.62 కోట్లు
♦ ఐటీ రంగానికి రూ.197.37 కోట్లు రెవెన్యూ లోటు రూ.26,646.92 కోట్లు
♦ కార్మిక సంక్షేమానికి రూ.601.37 కోట్లు
♦ పంచాయతీరాజ్,రూరల్ డెవలప్‌మెంట్‌కు రూ.16710..34 కోట్లు
♦ సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం రూ.1,37,518.07 కోట్లు
♦ మూలధన వ్యయం రూ.12,845.49 కోట్లు
♦ 2018-19లో స్థూల ఉత్పత్తి 8శాతమే పెరిగింది
♦ రేషన్ బియ్యానికి రూ.3వేల కోట్లు
♦ డ్వాక్రా సంఘాలకు రూ.975 కోట్లు
♦ పీఎం ఆవాజ్ యోజన (గ్రామీణం) రూ.500 కోట్లు
♦ ఎస్టీల సంక్షేమానికి రూ.1,840 కోట్లు
♦ బీసీల సంక్షేమానికి రూ.23,406 కోట్లుఎస్సీల సంక్షేమానికి రూ.7,525 కోట్లు
♦ బలహీనవర్గాల గృహ నిర్మాణానికి రూ. 150 కోట్లు
♦ వైస్సార్ రైతు భరోసా రూ. 3,615.60 కోట్లు
♦ డాక్టర్ వైఎస్సార్ పంట ఉచిత బీమా రూ.500 కోట్లు
♦ ప్రాథమిక, ఇంటర్ విద్యకు రూ.22,604 కోట్లు
♦ వడ్డీ లేని రుణాల కోసం రూ.1100 కోట్లు
♦ జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనలో ఉన్న విద్యకు రూ.2,277 కోట్లు
♦ 104,108లకు రూ.470.29 కోట్లు