ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 54,463 కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 8,601 పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజగా విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. ఇక తాజాగా నెల్లూరులో పది మంది, గుంటూరులో తొమ్మిది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, కడపలో ఎనిమిది మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, విశాఖపట్నంలో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, కృష్ణలో ఐదుగురు, విజయనగరంలో నలుగురు, కర్నూలులో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున మొత్తం మొత్తం 86 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,61,712 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 89,516 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. ఇక 2,68,828 మంది కోలుకోగా.. 3,368 మంది మృతి చెందారు.

కాగా, కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టినా.. పాజిటివ్‌ కేసుల సంఖ్య మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడమే సరైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఇక కరోనా పరీక్షల్లో దేశ వ్యాప్తంగా ఏపీ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.

గడిచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన కేసులు..

అనంతపురం – 933
చిత్తూరు – 495
ఈస్ట్‌ గోదావరి – 1441
గుంటూరు – 467
కడప – 639
కృష్ణ – 154
కర్నూలు – 484
నెల్లూరు – 965
ప్రకాశం – 589
శ్రీకాకుళం – 485
విశాఖ – 911
విజయనగరం -572
వెస్ట్ గోదావరి – 466

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort