ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 46,712 కరోనా పరీక్షలు చేయగా, కొత్తగా 7,895 పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజగా విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. ఇక తాజాగా నెల్లూరులో 13, పశ్చిమగోదావరి 13, చిత్తూరు 11, కర్నూలు 10, ప్రకాశం 9, కడప 8, శ్రీకాకుళం 6, విశాఖ 5, తూర్పుగోదావరి 4, అనంతపురం 3, గుంటూరు 3, కృష్ణ 3, విజయనగరం 2 చొప్పున మొత్తం 90 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 353111 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 89742 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. ఇక 260087 మంది కోలుకోగా, 3282 మంది మృతి చెందారు.

కాగా, కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టినా.. పాజిటివ్‌ కేసుల సంఖ్య మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడమే సరైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఇక కరోనా పరీక్షల్లో దేశ వ్యాప్తంగా ఏపీ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.

గడిచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన కేసులు
అనంతపురం – 466
చిత్తూరు – 934
ఈస్ట్‌ గోదావరి – 1256
గుంటూరు – 507
కడప – 448
కృష్ణ – 142
కర్నూలు – 685
నెల్లూరు – 985
ప్రకాశం – 923
శ్రీకాకుళం – 227
విశాఖ – 451
విజయనగరం -200
వెస్ట్ గోదావరి – 671

Ap

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort
Best10 tipobet