ఏపీలో కొత్తగా 7,895 కరోనా పాజిటివ్‌ కేసులు

By సుభాష్  Published on  23 Aug 2020 5:18 PM IST
ఏపీలో కొత్తగా 7,895 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 46,712 కరోనా పరీక్షలు చేయగా, కొత్తగా 7,895 పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజగా విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. ఇక తాజాగా నెల్లూరులో 13, పశ్చిమగోదావరి 13, చిత్తూరు 11, కర్నూలు 10, ప్రకాశం 9, కడప 8, శ్రీకాకుళం 6, విశాఖ 5, తూర్పుగోదావరి 4, అనంతపురం 3, గుంటూరు 3, కృష్ణ 3, విజయనగరం 2 చొప్పున మొత్తం 90 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 353111 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 89742 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. ఇక 260087 మంది కోలుకోగా, 3282 మంది మృతి చెందారు.

కాగా, కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టినా.. పాజిటివ్‌ కేసుల సంఖ్య మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడమే సరైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఇక కరోనా పరీక్షల్లో దేశ వ్యాప్తంగా ఏపీ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.

గడిచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన కేసులు

అనంతపురం - 466

చిత్తూరు - 934

ఈస్ట్‌ గోదావరి - 1256

గుంటూరు - 507

కడప - 448

కృష్ణ - 142

కర్నూలు - 685

నెల్లూరు - 985

ప్రకాశం - 923

శ్రీకాకుళం - 227

విశాఖ - 451

విజయనగరం -200

వెస్ట్ గోదావరి - 671

Ap

Next Story