ఏవోబీలో భారీ డంప్ స్వాధీనం
By సుభాష్ Published on 25 Aug 2020 5:23 AM GMTఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎత్తున డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల డంప్‌ను బీఎస్‌ఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో సరిహద్దు ప్రాంతంలో భద్రతా బలగాలు, జిల్లా వాలంటీ ర్‌ఫోర్స్ బలగాలు నేతృత్వంలో ఏవోబీలోని కలిమెల పోలీస్‌స్టేషన్ పరిధిలోని సూదికొండ సమీపంలో కురూబ్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా, మావోయిస్టులు దాచి ఉంచిన ఈ డంప్ దొరికింది. ఈ డంప్‌లో ఆయుధాల తయారీకి ఉపయోగించే లేత్‌మిషన్, గ్యాస్ వెల్డింగ్ చేసే సిలిండర్లు, లేత్ మిషన్ విడిభాగాలతో పాటు ఆయుధాలు, బుల్లెట్లు విప్లవ సాహిత్యం, ఇనుప తుక్కు సామాగ్రీ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, మల్కాన్‌గిరి జిల్లా కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న డంప్‌ను మీడియా ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మల్కాన్‌గిరి జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ కురూబ్ అటవీ ప్రాంతంలో కలిమెల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల సమావేశం నిర్వహించారని, ఈ మేరకు తమకు అందిన సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టగా, ఆ ప్రదేశంలో ఆయుధాలు తయారు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఇదే ప్రాంతంలో మరో రెండు రోజుల పాటు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.