తెలుగు రాష్ట్రాలకు 4 ప్రత్యేక రైళ్లు.. దేశ వ్యాప్తంగా 39 రైళ్లు

By సుభాష్  Published on  8 Oct 2020 5:55 AM GMT
తెలుగు రాష్ట్రాలకు 4 ప్రత్యేక రైళ్లు.. దేశ వ్యాప్తంగా 39 రైళ్లు

కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా రైళ్లను పరిమిత సంఖ్యలో నడుపుతోంది రైల్వేశాఖ. అయితే దసరా పండగ సీజన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా మరికొన్ని రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. దీంతో 39 అదనపు ప్రత్యేక రైళ్లకు జోన్లను రైల్వే బోర్డు అనుమతి ఇచ్చినట్లు రైల్వే మంత్రిత్వశాఖ బుధవారం ప్రకటించింది. అలాగే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో నాలుగు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్లు ప్రధాన నగరాల గుండా రాకపోకలు సాగించనున్నాయి.

లింగంపల్లి-కాకినాడ, సికింద్రాబాద్‌-షాలిమార్‌ రైళ్లకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. అలాగే సికింద్రాబాద్‌-విశాఖ, విశాఖ-తిరుపతి రైళ్లు నడిపేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నాలుగు ప్రత్యేక రైళ్ల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు కొంత మేలు జరగనుంది.

అయితే కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా పరిమిత సంఖ్యలో నడుపుతున్న రైళ్లను తాజాగా మరో 39 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో మార్చి 25 నుంచి రైళ్ల సేవలు నిలిచిపోయాయి. అయితే ఆ తర్వాత వలస కూలీల తరలింపు కోసం దేశ వ్యాప్తంగా 230 ప్రత్యేక రైళ్లకు అనుమతించిన రైల్వేశాఖ.. సెప్టెంబర్‌ నుంచి మరో 80 ప్రత్యేక రైళ్లకు పచ్చజెండా ఊపగా, తాజాగా మరో 39 రైళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

రైల్వే శాఖ నిర్ణయంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో నాలుగు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. లింగంపల్లి – కాకినాడ, సికింద్రాబాద్ -షాలిమర్ ట్రైన్స్‌కు రైల్వే శాఖ అనుమతిచ్చింది. వీటితో పాటు.. సికింద్రాబాద్- విశాఖ, విశాఖ -తిరుపతి రైళ్లు నడిపేందుకు పచ్చ జెండా ఊపింది. ఈ నాలుగు ప్రత్యేక రైళ్ల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు కొంత ఊరట లభించింది

దేశ వ్యాప్తంగా నడిచే మరో 39 రైళ్లు ఇవే..

1.న్యూఢిల్లీ నుంచి కత్రా (డైలీ

2. సికింద్రాబాద్‌ నుంచి షాలిమార్‌ (వీక్లీ)

3. నిజాముద్దీన్‌ నుంచి పుణే (వీక్లీ)

4. ఆనంద్‌ విహార్‌ నుంచి నహర్లాగన్‌ (వీక్లీ)

5. న్యూ ఢిల్లీ నుంచి కత్రా (డైలీ)

6. లోమాన్య నుంచి హరిద్వార్‌ (వీక్లీ)

7. లోమాన్య నుంచి లక్నో (వీక్లీ)

8. బార్మర్‌ నుంచి యస్వంత్‌పూర్‌ (వీక్లీ)

9. అజ్ని నుంచి పూణే (వీక్లీ)

10. నాగ్‌పూర్‌ నుంచి అమృత్‌ సర్‌ (వీక్లీ)

11. కామాఖ్య నుంచి లోమాన్య తిలక్‌ (వీక్లీ)

12. లింగంపల్లి నుంచి కాకినాడ (ట్రై వీక్లీ)

13. సికింద్రాబాద్‌ నుంచి వైజాక్‌ (వీక్లీ

14. సాంట్రగచి నుంచి చెన్నై (బై వీక్లీ)

15. హౌరా నుంచి యశ్వంత్‌పూర్‌ (వీక్లీ)

16. చెన్నై నుంచి మధురై (ట్రై వీక్లీ)

17. బాంద్రా నుంచి భుజ్‌ (ట్రై వీక్లీ)

18. భువనేశ్వర్‌ నుంచి ఆనంద్‌ విహార్‌ (వీక్లీ)

19. భువనేశ్వర్‌ నుంచి ఢిల్లీ (వీక్లీ)

20. నిజాముద్దీన్‌ నుంచి పూణే (ద్వీ వీక్లీ)

21. హౌరా నుంచి పూణే (బై వీక్లీ)

22. చెన్నై నుంచి నిజాముద్దీన్‌ (బై వీక్లీ)

23. దిబ్రుగర్‌ నుంచి న్యూ ఢిల్లీ (వీక్లీ)

24. న్యూ ఢిల్లీ నుంచి హబీబ్‌గంజ్‌ (డైలీ)

25. న్యూఢిల్లీ నుంచి అమృత్‌సర్‌ (డైలీ)

26. న్యూఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌ (డైలీ)

27. దిబ్రుగర్‌ నుంచి న్యూ ఢిల్లీ (ద్వి వీక్లీ)

28. ముంబై సెంట్రల్‌ నుంచి నిజాముద్దీన్‌ (డైలీ

29. బాంద్రా నుంచి నిజాముద్దీన్‌ (వీక్లీ)

30. బెంగళూరు నుంచి చెన్నై (మంగళవారం తప్ప)

31. ముంబై సెంట్రల్‌ నుంచి ఆహ్మదాబాద్‌ (ఆదివారం తప్ప)

32. చెన్నై నుంచి కోయంబత్తూరు (మంగళవారం మినహా)

33. న్యూఢిల్లీ నుంచి అమృత్‌సర్‌ ( గురువారం మినహా)

34. హౌరా నుంచి రాంచీ (ఆదివారం తప్ప)

35. న్యూఢిల్లీ నుంచి శ్రీమాతా వియాష్నోదేవి కత్రా (మంగళవారం మినహా)

36. జైపూర్‌ నుంచి ఢిల్లీ చీర రోహిల్లా (డైలీ)

37. అహ్మదాబాద్‌ నుంచి ముంబై సెంట్రల్‌ (ఆదివారం తప్ప)

38. చెన్నై నుంచి బెంగళూరు (డైలీ)

39. విశాఖ నుంచి తిరుపతి (వారంలో మూడు రోజులు)

Next Story
Share it