చైనా నుంచి కర్నూలుకు..అన్నెం జ్యోతి
By రాణి Published on 14 March 2020 2:28 PM ISTసుమారు రెండు నెలల క్రితం చైనా లోని వుహాన్ నగరం నుంచి కరోనా వైరస్ వ్యాపించడం మొదలైంది. అక్కడే మొదటి కరోనా కేసు..మొదటి కరోనా మృతి కూడా నమోదైంది. అలా అలా రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతుండటంతో..కరోనా బాధితుల కోసం చైనా ఓ ప్రత్యేక ఆస్పత్రిని కూడా కట్టేసింది. ప్రస్తుతం అక్కడ కరోనా కేసుల నమోదు సంఖ్య తగ్గినప్పటికీ..ఇంకా ఆస్పత్రుల్లో సుమారు 80 వేల బాధితులున్నట్లు సమాచారం.
Also Read : రూపాయికికే చికెన్ బిర్యానీ.. కొనేందుకు ఎగబడ్డ జనం..
అయితే..వుహాన్ నుంచి కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆ నగరంలోనే ఉన్న తెలుగు విద్యార్థులు తమను భారత్ కు పంపాలని వేడుకున్నారు. భారత ప్రభుత్వంతో చర్చల తర్వాత 200 మందికి పైగా విద్యార్థులను భారత్ కు పంపేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది చైనా ప్రభుత్వం. అందరూ విమానం ఎక్కేశారు..ఒక్క ముగ్గురు తప్ప. వాళ్లలోనే కర్నూలుకు చెందిన అన్నెం జ్యోతి కూడా ఉంది. ఆమెకు విమానం ఎక్కే సమయానికి శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటంతో ఎయిర్ పోర్ట్ అధికారులు ఆమె విమానం ఎక్కేందుకు అనుమతించలేదు. ఇక అప్పట్నుంచీ..సుమారు 40 రోజుల పాటు జ్యోతితో పాటు, ఆంధ్రాలో ఉన్న ఆమె తల్లి, కాబోయే భర్త కూడా భారత ప్రభుత్వానికి పలుమార్లు తమ కుమార్తెను ఇంటికి చేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో..ఎట్టకేలకు జ్యోతి ఇండియా చేరుకుంది.
Also Read : దొరబాబు చేసిన పనికి ‘హైపర్ ఆది’కి దెబ్బేనా..?
14 రోజుల క్రితమే జ్యోతి వుహాన్ నుంచి ఢిల్లీకి చేరుకుంది. అక్కడ చావ్లా లోని ఐటీబీపీ మెడికల్ ఐసోలేషన్ క్యాంపులో 14 రోజుల పాటు ఆమెను పర్యవేక్షణలో ఉంచారు అధికారులు. ఈ 14 రోజుల్లో ఆమెకు ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోవడంతో..ఇంటికి పంపేందుకు వైద్యులు అంగీకరించారు. దీంతో..అన్నెం జ్యోతి శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకుంది. హైదరాబాద్ నుంచి కర్నూల్ కు వెళ్లి కుటుంబ సభ్యులను కలవనుంది జ్యోతి. కాగా..కరోనా వైరస్ నేపథ్యంలోనే జ్యోతి పెళ్లి కూడా ఆగిపోయింది. ఇంట్లో పెద్దలు నిర్ణయించిన ముహూర్త సమయానికి ఆమె రాలేకపోతుందని అంచనా వేసిన కుటుంబ సభ్యులు పెళ్లిని వాయిదా వేశారు. ఈ అమ్మాయిని భారతదేశంలోని స్వస్థలం రప్పించేందుకు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ భావన సక్సేన నేతృత్వంలో OSD పి. రవిశంకర్ తదితరులు కృషి చేశారు. వారందరికీ జ్యోతి కృతజ్ఞతలు తెలిపింది.
Also Read : అశ్లీల ఫొటోలతో పెట్టుబడి.. అడ్డంగా బుక్కైన యువకుడు