అది చెప్ప‌గానే.. భ‌య‌ప‌డ్డాను - డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి

By అంజి  Published on  2 Dec 2019 11:54 AM GMT
అది చెప్ప‌గానే.. భ‌య‌ప‌డ్డాను - డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి

ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం 'భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు'.ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్‌, నటుడు వై.శ్రీనివాస్ రెడ్డి ద‌ర్శ‌క నిర్మాత‌గా ప‌రిచ‌యమౌతున్నారు. డిసెంబ‌ర్ 6న విడుద‌ల సినిమాను విడుద‌లవుతుంది.

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథులుగా అనిల్ రావిపూడి, ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ పాల్గొన్నారు. బ్యాన‌ర్ లోగోను అనిల్ రావిపూడి విడుద‌ల చేశారు. టైటిల్ యానిమేష‌న్‌ను ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “ఇండ‌స్ట్రీలో నేను వ‌చ్చిన‌ప్ప‌టి నుండి నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్‌లో శ్రీనివాస్‌రెడ్డి ఒక‌రు. అందుక‌నే నా సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంటుంది. కానీ ఇప్పుడు 'స‌రిలేరు నీకెవ్వ‌రు'లో త‌ను మిస్స‌య్యాడు.

ఈ సినిమా చేయాల‌నుకోగానే ముందు న‌న్ను స‌ల‌హా అడిగాడు. త‌ను మా సినిమా షూటింగ్‌లో కూడా ఆర్టిస్ట్ కంటే అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గానే ఎక్కువ క‌ష్ట‌ప‌డుతుంటాడు. త‌ను డైరెక్ష‌న్‌తో పాటు ఈ సినిమాకు ప్రొడ‌క్ష‌న్ కూడా చేస్తున్నాన‌ని చెప్ప‌గానే కాస్త భ‌య‌ప‌డ్డాను. ఎందుకన్నా.. రిస్క్ ఏమో! అని అన్నాను. కానీ త‌ను మంచి ప్లానింగ్‌తో సినిమాను పూర్తి చేశాడు. అలాగే వాళ్ల ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ గ్రూప్ త‌న‌ను బాగా న‌మ్మారు. నేను సినిమాను చూశాను. నాకు స‌న్నివేశాలు బాగా న‌చ్చాయి. ప్రేక్ష‌కులు శ్రీనివాస్‌రెడ్డి గారి తొలి ప్ర‌య‌త్నాన్ని స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను. సాకేత్‌కు, ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్“ అన్నారు.

Next Story