మంత్రిగారిని పరుగులు పెట్టించిన తేనేటీగలు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Nov 2019 2:32 PM ISTకర్నూలు: జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ పర్యటనలో అపశృతి చేసుకుంది. పాములపాడు మండలం, బానక చెర్ల హెడ్ రెగ్యులేటర్ ను సందర్శించేందుకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ఐదుగురు ఎమ్మెల్యే లు వెళ్లారు. రెగ్యులేటర్ దగ్గరికి చేరుకొని పరిశీలిస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు లేసాయి. జనాల హడావుడి ఎక్కువగా వుండటంతో తేనేటీగలు ఓ రేంజ్ లో విజృంబించాయి.
తెనేటీగలు గుంపులుగా లేవడంతో మంత్రి, ఎమ్మెల్యేలు, జనాలు పరుగులు పెట్టారు. దీంతో కొంతమందిపైన తేనేటీగలు దాడిచేశాయి. తేనేటీగల దాడిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తో పాటు ఇతర నాయకులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story