ఎన్నాళ్లకెన్నాళ్లకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాలు..!

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 31 Oct 2019 2:44 PM IST

ఎన్నాళ్లకెన్నాళ్లకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాలు..!

అమరావతి: ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతుంది.విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో వేడుకలు అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా గవర్నర్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తరువాత మొదటి సారి రాష్ట్ర అవతరణ వేడుకలు జరుగుతున్నాయి. మూడు రోజులపాటు వేడుకలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. మొదటి రోజు హస్త కళలు, చేనేత ప్రదర్శన ఉంటుంది.రెండోవ రోజు కూచిపూడి నృత్య ప్రదర్శన, లలిత ప్రదర్శనలు, సురభి నాటకాలు,జానపద కళల ప్రదర్శన ఉంటుంది. ముడవరోజు తెలుగు సంప్రదాయల ఆహర ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుందని అధికారులు చెప్పారు.

అయితే..ఏపీ ప్రభుత్వం మాత్రం అమర జీవి పొట్టి శ్రీరాములు ఫొటో లేకుండా అవతరణోత్సవాల ఆహ్వాన పత్రిక ముద్రించడంపై విమర్శలు వస్తున్నాయి.

Ama



Next Story