తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. తిరుపతి ఉప ఎన్నికలో 2 లక్షల 31 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గురుమూర్తి గెలుపొందారు. ప్రస్తుతం ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీకి మెజార్టీ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గురుమూర్తి విజయంతో వైసీపీ శ్రేణుల్లో సంతోషం అంబరాన్నంటుతోంది.
గురుమూర్తి తన సమీప టీడీపీ ప్రత్యర్థి పనబాక లక్ష్మిపై గెలుపొందారు. టీడీపీ, బీజేపీ-జనసేన రెండు, మూడు స్థానాలకే పరిమితం అయ్యాయి. మధ్యాహ్నం 3.30 గంటల సమయానికి తిరుపతి బరిలో వైసీపీకి 5,33,961 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 3,02,580 ఓట్లు లభించాయి. ఆ తర్వాత స్థానంలో బీజేపీ-జనసేనకు 50,354 ఓట్లు వచ్చాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ-జనసేన అభ్యర్థి రత్నప్రభ మొత్తం ఓట్లు ఇప్పటిదాకా కనీసం లక్ష కూడా దాటలేదు. ఇక, కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ కు 8,406... సీపీఎంకు 4,978, ఇతరులకు 30,381, నోటాకు 13,175 ఓట్లు వచ్చాయి.