వైసీపీ ప్లీనరీ.. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు.. ట్రాఫిక్ మళ్లింపు
YSRCP Plenary 2022 Traffic Diversions At NH 16. గుంటూరులో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి
By తోట వంశీ కుమార్ Published on 8 July 2022 11:56 AM ISTగుంటూరులో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు సీఎం జగన్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా ప్లీనరీలోనే ఉండనుండటంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్లీనరీ పరిసర ప్రాంతాలతో పాటు అటు వైపు వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెద్దకాకాని వద్ద జాతీయ ఎన్‌హెచ్-16 వద్ద జరిగే వైసీపీ ప్లీనరీ సమావేశాలు సందర్భంగా ఈ నెల 8, 9 తేదీల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని గుంటూరు రేంజ్ డీఐజీ కీలక ప్రకటన చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
భారీ వాహనాల మళ్లింపు:
అన్ని భారీ వాహనములు 09.07.2022 ఉదయం 10.00 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ క్రింది ప్లీనరీ సదస్సు జరుగుతున్న జాతీయ రహదారిపైకి రాకుండా మళ్లించారు.
* చెన్నై వైపు నుండి విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు మరియు ఇబ్రహీంపట్నం, నందిగామ వైపుకు వెళ్ళు భారీ గూడ్స్ వాహనములు ఒంగోలు జిల్లా త్రోవగుంట వద్ద నుండి చీరాల- బాపట్ల – రేపల్లె- అవనిగడ్డ- పామర్రు – గుడివాడ – హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం మరియు ఇబ్రహీంపట్నం వైపుకు మళ్లింపు
* గుంటూరు నుండి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను బుడంపాడు X మిధుగా తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూరి బ్రిడ్జ్ మిధుగా అవనిగడ్డ, పామర్రు-గుడివాడ-హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించారు.
* విశాఖపట్నం వైపు నుండి చెన్నై వైపు వెళ్ళు లారీలు, భారీవాహనములు హనుమాన్ జంక్షన్ వద్ద నుండి గుడివాడ – పామర్రు - అవనిగడ్డ – రేపల్లె- బాపట్ల – చీరాల - త్రోవగుంట – ఒంగోలుజిల్లా మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
* విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపు వెళ్ళు లారీలు, భారీవాహనములు హనుమాన్ జంక్షన్ వద్ద నుండి నూజివీడు- మైలవరం – జి కొండూరు, ఇబ్రహీంపట్నం వైపు మళ్లించారు.
*హైదరాబాద్ వైపు నుండి విశాఖపట్నం వెళ్ళు లారీలు, భారీవాహనములు ఇబ్రహీంపట్నం వద్ద నుండి జి.కొండూరు – మైలవరం-నూజివీడు-హనుమాన్ జంక్షన్ వద్ద నుండి అనుమతిస్తారు.
* చెన్నై వైపు నుండి విశాఖపట్నం వైపు వెళ్ళే multi-axel Goods వాహనాలను ఎటువంటి మళ్లింపు లేకుండా జాతీయ రహదారి కి సమీపంలోని చిలకలూరి పేట, ఒంగోలు మరియు నెల్లూరు వద్ద నిలిపివేయబడును. ఆ వాహనాలను రాత్రి 10 గంటల అనతరం వాహనాలను అనుమతిస్తారు.
*విశాఖపత్నమ వైపు నుండి చెన్నై వైపు వెళ్ళే multi-axel Goods వాహనాలను హనుమాన్ జంక్షన్ వద్ద మరియు పొట్టిపాటు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారికి సమీపంలో నిలిపివేయబడును. ఆ వాహనాలను రాత్రి10 గంటల అనoతరం వాహనాలను అనుమతిస్తారు.
ప్లీనరీ కి వచ్చే వారి వాహనాల పార్కింగ్ ప్రదేశం వివరాలు
- విజయవాడ నుండి ప్లీనరీ కి వచ్చు బస్సులు కొరకు కాజా టోల్ ప్లాజా వద్ధ గల RK Venuzia లేఅవుట్.
- విజయవాడ నుండి ప్లీనరీ కి వచ్చు కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు కొరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ.
- గుంటూరు నుండి ప్లీనరీ కి వచ్చు బస్సులు కొరకు నంబూరు & కంతెరు రోడ్డు పై.
- గుంటూరు నుండి ప్లీనరీ కి వచ్చు కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలుకొరకు కేశవరెడ్డి స్కూల్, అమలోద్భవి -హోటల్ & రైన్ ట్రీ అపార్ట్మెంట్స్ పక్కన పార్కింగ్‌కు ఏర్పాటు చేశారు.