వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్

YSRCP official twitter account hacked.వైసీపీ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాను హ్యాక్ చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Dec 2022 11:35 AM IST
వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాను హ్యాక్ చేశారు. శుక్ర‌వారం అర్థ‌రాత్రి వైసీపీ ట్విట్ట‌ర్ ఖాతాను సైబ‌ర్ నేర‌గాళ్లు హ్యాక్ చేశారు. అనంత‌రం ప్రొఫైల్ పిక్‌తో పాటు బ‌యోడెటా వివ‌రాల‌ను సైతం మార్చివేశారు.

ట్విట్టర్ అకౌంట్ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉంచేసి.. బయోను మాత్రం ఎన్ఎఫ్టీ మిలియనీర్( NFT Millionarie ) అమెరికా అని మార్చేశారు.క్రిప్టో క‌మ్యూనిటీ పోస్టులు పెట్టారు. ఎలాన్ మస్క్ ఎన్‌ఎఫ్‌టీలు ఫ్రీగా ఇస్తున్నారని రీ ట్వీట్లు చేశారు.

అర్థ‌రాత్రి నుంచి పార్టీకి గానీ, ప్ర‌భుత్వానికి గానీ ఎలాంటి సంబంధం లేని పోస్టులు వ‌స్తుండ‌డంతో త‌మ ఖాతా హ్యాక్ అయిన‌ట్లు వైసీపీ టెక్నిక‌ల్ టీమ్ గుర్తించింది. వెంట‌నే ఖాతా పున‌రుద్ద‌ర‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టింది.

Next Story