పచ్చ పార్టీకి కొత్త నాయకత్వం వచ్చేది ఎప్పుడు బుచ్చన్నా?

YSRCP MP Vijay Sai reddy slams atchannaidu.తెలుగుదేశం పార్టీ గురుంచి వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శలు చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 March 2021 3:26 PM IST
YSRCP MP Vijay Sai reddy

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు, ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శలు చేశారు. తెలుగు దేశం పార్టీని ఎన్టీరాఆర్ స్థాపిస్తే.. బాబు స‌మాధి చేశాడ‌న్నారు. తండ్రీకొడుకుల దృత‌రాష్ట్ర కౌగిలి నుంచి ఆ పార్టీ బ‌య‌ట‌ప‌డేదెప్పుడ‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో కీలక పాత్ర పోషించాలంటూ టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

'తండ్రీకొడుకుల ధృతరాష్ట్ర కౌగిలి నుంచి బయట పడేదెప్పుడు? పచ్చ పార్టీకి కొత్త నాయకత్వం వచ్చేది ఎప్పుడు బుచ్చన్నా? త్వరలో చీలికలు, పీలికలు అయి ఎవరి ముక్క వాళ్లు లాక్కెళ్తారని సూటిగా చెప్పొచ్చుగా. నూతన నాయకులు రావడానికి ఏం మిగిలిందని? ఎన్టీఆర్ స్థాపిస్తే బాబు సమాధి చేశాడు పార్టీని'. అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.


'ముందు నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకో అచ్చన్నా. తర్వాత వాలంటీర్ల కథ చూద్దువు. వాలంటీర్లు అంటే స్వచ్చంద సేవకులని అర్థం. వారు చేస్తున్నది గొప్ప సేవ. వారేమైనా మీ జన్మభూమి కమిటీ సభ్యులనుకున్నావా? మండల ఆఫీసులో కూర్చొని మేసెయ్యడానికి! వాలంటీర్ వ్యవస్థ దండగో – పండగో జనం చెప్తారులే'. అని ఆయన విమర్శించారు.


జూలై 8న వైయస్సార్ జయంతి నాడు ముఖ్యమంత్రి జగన్ కొత్త కార్యక్రమానికి నాంది పలుకుతున్నారని విజయసాయి అన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యం అమలు చేస్తున్న జగనన్న ప్రభుత్వం... ఇప్పుడు ఆ పల్లెల పరిశుభ్రతకు సంకల్పించిందని చెప్పారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల్లో పరిశుభ్రతకు శ్రీకారం చుడుతున్నారన్నారు.


Next Story