'మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు.. కాస్తా టైం కావాలి'.. సీబీఐకి అవినాష్‌రెడ్డి లేఖ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు సీబీఐ విచారణకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన వైఎస్ఆర్

By అంజి  Published on  22 May 2023 8:15 AM IST
YSRCP MP Avinash Reddy, CBI, Viveka Murder case

'మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు.. కాస్తా టైం కావాలి'.. సీబీఐకి అవినాష్‌రెడ్డి లేఖ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు సీబీఐ విచారణకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ సమన్లు ​​జారీ చేసింది. అయితే తన తల్లి ఆరోగ్యాన్ని గురించి చెబుతూ, విచారణకు హాజరుకావడానికి కాస్తా సమయం కావాలని కోరుతూ కేంద్ర ఏజెన్సీ సీబీఐకి వైఎస్‌ అవినాష్‌రెడ్డి లేఖ రాశారు. అవినాష్‌రెడ్డి తల్లి ప్రస్తుతం కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎంపీ సన్నిహిత వర్గాలు ఆదివారం తెలిపాయి.

తమ ఎదుట హాజరు కావడానికి సమయం కావాలని అవినాష్‌రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. తన తల్లి కోలుకున్నాకే సీబీఐకి వస్తానని రాశాడు’’ అని వారు తెలిపారు. సీబీఐ స్పందన వెంటనే తెలియరాలేదు. 2019 మార్చిలో జరిగిన వివేకానందరెడ్డి హత్యకేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణలో ఉన్నారు. ఈనెల 19న సీబీఐ ఎదుట హాజరుకావాల్సిందిగా కోరగా.. తన తల్లికి బాగోలేదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున హాజరుకాలేదన్నారు. మే 22న హాజరుకావాలని విచారణ సంస్థ మరో నోటీసు జారీ చేసింది.

అవినాష్ రెడ్డి ఈ ఏడాది కనీసం ఐదుసార్లు సీబీఐ ఎదుట హాజరయ్యారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌తో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

Next Story