అయ్యన్నపాత్రుడి ఇంటి ముట్టడికి యత్నం

YSRCP leaders protest in Vishaka.టీడీపీ నేత అయ్య‌న్న‌పాత్రుడు ఇంటి ముట్ట‌డికి స్థానిక వైసీపీ నేత‌లు య‌త్నించారు. సీఎం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Sept 2021 2:42 PM IST
అయ్యన్నపాత్రుడి ఇంటి ముట్టడికి యత్నం

టీడీపీ నేత అయ్య‌న్న‌పాత్రుడు ఇంటి ముట్ట‌డికి స్థానిక వైసీపీ నేత‌లు య‌త్నించారు. సీఎం జ‌గన్‌పై అయ్య‌న్న‌పాత్రుడు చేసిన వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా ఎమ్మెల్యే ఉమాశంక‌ర్ ఆధ్వ‌ర్యంలో వైసీపీ శ్రేణులు ఆందోళ‌న‌కు దిగాయి. అయ్యన్న ఇంటిని ముట్టడించేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీగా బయల్దేరారు. అబీద్ కూడ‌లికి చేరుకున్న అనంత‌రం చంద్ర‌బాబు, అయ్య‌న్న దిష్టిబొమ్మ‌ల‌ను ద‌గ్ధం చేశారు. ఇంటిని ముట్ట‌డించేందుకు వెలుతుండ‌గా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే, ప‌లువురు నాయ‌కులు రోడ్డు మీదే బైఠాయింఆరు. అయ్య‌న్న‌పాత్రుడిని అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. అనంత‌రం పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి అయ్య‌న్న‌పాత్రుడిని అరెస్ట్ చేయాలంటూ ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉంటే.. వైసీపీ నేతల తీరుపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యల్లో అభ్యంతరాలు ఉంటే శాంతియుతంగా ఆందోళనలు చేయడం లేదా పోలీసులకు ఫిర్యాదు చేయడం చేయవచ్చని.. కానీ, వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. వైసీపీ నేత‌ల‌పై కేసులు న‌మోదు చేయాల‌ని అంటున్నారు.

Next Story