సూపర్ సిక్స్ పై బుగ్గన సెటైర్లు
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అప్పులు చేస్తున్నారని..
By Medi Samrat Published on 27 July 2024 3:42 PM ISTటీడీపీ ప్రభుత్వం ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి టీడీపీ మొత్తం అబద్ధాలు చెప్పిందంటూ విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు పెట్టిన శ్వేత పత్రంలో అన్ని అసత్యాలే ఉన్నాయని అన్నారు. చంద్ర బాబు సూపర్ సిక్స్ అని చెప్పి.. డక్కౌట్ అయ్యారని ఆరోపించారు. ప్రజల ఆశలు నీరుగార్చేలా ఆయన వైట్ పేపర్ ఉందని బుగ్గన విమర్శించారు. మా పాలనలోనే ఏపీ తలసరి ఆదాయం మెరుగుపడిందని.. 2018-19 టైంలో ఏపీ తలసరి ఆదాయంలో 18వ స్థానంలో ఉందని.. అదే 2022-23లో 7వ స్థానానికి చేరుకుందన్నారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అప్పులు చేస్తున్నారని.. వైఎస్సార్‌సీపీ చేస్తే అప్పు.. టీడీపీ చేస్తే నిప్పు అన్నట్లు కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఏపీలో బడులు తెరిచి ఇన్నిరోజులు అయినా.. తల్లుల ఖాతాలో ఇంకా నగదు జమ చేయలేదని బుగ్గన విమర్శించారు. అప్పుల విషయంలో గవర్నర్ తో కూడా చంద్ర బాబు అబద్ధాలు చెప్పించారన్నారు.
Next Story