కౌలు రైతులకు పెట్టుబడి సాయం విడుదల చేసిన సీఎం జగన్

కౌలు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సహాయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు.

By Srikanth Gundamalla  Published on  1 Sep 2023 12:04 PM GMT
YSR Rythu Bharosa,  CM Jagan, AP Govt,

కౌలు రైతులకు పెట్టుబడి సాయం విడుదల చేసిన సీఎం జగన్

కౌలు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సహాయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు తోడుగా ఏపీ ప్రభుత్వం పెట్టుబడి సహాయం అందిస్తుందని చెప్పారు. సీసీఆర్‌సీ కార్డులు పొంది కౌలు చేసుకుంటున్న రైతులకు తొలి విడత పెట్టుబడి సహాయం అందించినట్టుగా చెప్పారు. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 52 లక్షల 50వేల మంది రైతులకు మేలు కలుగుతుందని వివరించారు.

భూమి లేని పేదలకు సైతం తమ ప్రభుత్వం ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ అన్నారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయం జమ చేయడంతో పాటు.. రెండు మంచి కార్యక్రమం కూడా ప్రారంభించుకున్నామని సీఎం జగన్ చెప్పారు. దేవదాయ శాఖ భూములు కౌలు చేసుకుంటున్న రైతులకు కూడా 2023-24కి సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయం రూ.7,500 అందిస్తున్నట్లు చెప్పారు. ఇక రెండో మంచి కార్యక్రమం అయితే.. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా ఆ సీజన్‌లో జరిగిన నష్టాన్ని ఆ సీజ్‌లోనే రైతున్న చేతిలో పెడుతున్నామని అన్నారు.

ఏపీలో 1.46 లక్షల మంది కౌలు రైతులకు రూ.109.74 కోట్లు జమ చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవాదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింప జేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. పంట హక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, అలాగే దేవాదాయ భూములను సాగు చేస్తున్న రైతులకు సాయం పంపిణీ చేస్తున్నామని అన్నారు సీఎం జగన్. వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా అందరికీ కలిపి ఇప్పటి వరకు పథకం ద్వారా 52.57 లక్షల రైతు కుటుంబాలకు రూ.31,005.04 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని నేరుగా వాళ్ల ఖాతాల్లో జమ చేయగలిగామని అందించామని సీఎం జగన్‌ తెలిపారు.

Next Story