జగన్ అన్యాయం చేశాడు..YSR ఆస్తులపై విజయమ్మ సంచలన ప్రకటన

వైఎస్ విజయమ్మ క్లారిఫికేషన్ పేరుతో ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు.

By -  Knakam Karthik
Published on : 20 March 2026 4:51 PM IST

Andrapradesh, YS Vijayamma, YS Jagan, YS Sharmila, YSR Family, Assets Dispute

జగన్ అన్యాయం చేశాడు..YSR ఆస్తులపై విజయమ్మ సంచలన ప్రకటన

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఆస్తుల వ్యవహారంపై గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ, ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ క్లారిఫికేషన్ పేరుతో ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఆమె కుటుంబ ఆస్తుల పంపకాలు మరియు ప్రస్తుత వివాదంపై తన గళాన్ని వినిపిస్తూ సంచలన నిజాలను వెల్లడించారు.

2009లో వైఎస్సార్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని, అప్పటి వరకు ఎలాంటి పంపకం జరగలేదని విజయమ్మ స్పష్టం చేశారు. తన నలుగురు మనుమలకు (జగన్, షర్మిల పిల్లలకు) ఆస్తులన్నీ సమానంగా పంచాలన్నదే వైఎస్సార్ ఉద్దేశమని, అదే ఆయన ఆదేశమని ఆమె గుర్తు చేశారు. ఎంఓయూ (MOU)లో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవేనని, నిజానికి జగన్ తన చెల్లెలికి తక్కువే రాశాడని ఆమె పేర్కొన్నారు. సరస్వతి సిమెంట్స్‌తో పాటు ఎంఓయూలో లేని యెలహంక భూమి కూడా షర్మిలదేనని, జగన్ ఇచ్చానని చెబుతున్న డబ్బు షర్మిల వాటాకు రావాల్సిన 'డివిడెండ్' మాత్రమేనని వివరించారు.

ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశాడని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఒక తల్లిగా తన కొడుకు ఎప్పటికైనా వారికి న్యాయం చేస్తాడని ఆశిస్తున్నట్లు ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. "నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుకుకి తెలుసు.. అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్సార్ భార్యగా చేతులు జోడించి వేడుకుంటున్నాను" అని ఆమె తన లేఖలో ముగించారు.

Next Story