ప్రధాని మోదీ అభినవ గాడ్సే..షర్మిల సంచలన కామెంట్స్

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భారత ప్రధాని మోదీపై సంచలన కామెంట్స్ చేశారు.

By -  Knakam Karthik
Published on : 16 Dec 2025 1:37 PM IST

Andrapradesh, YS Sharmila, Ap Congress, Narendra Modi, MGNREGA, Mahatma Gandhi

ప్రధాని మోదీ అభినవ గాడ్సే..షర్మిల సంచలన కామెంట్స్

విజయవాడ: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భారత ప్రధాని మోదీపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆమె ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు. బాపూజీ పేరు మార్చాలని చూసే ప్రధాని మోదీ అభినవ గాడ్సే. నాథూరామ్ కి వారసుడు. అనాడు గాడ్సే మహాత్మను భౌతికంగా హత్య చేస్తే, నేడు బాపుజీ పేరు తొలగించి గాంధీజీ ఆశయాలను,స్వాతంత్ర్యపు లక్ష్యాలను, నేర్పిన సిద్ధాంతాలను తుడిచిపెట్టి మోడీ గారు మరో హత్య చేస్తున్నారు.

ఉపాధి హామీ పథకానికి జాతిపిత పేరు మార్చాలని చూడటం దేశ ద్రోహపు చర్యనే. ఇది మహాత్మాకు NDA ప్రభుత్వం చేస్తున్న తీరని ద్రోహం. పథకానికి "రామ్ - జి" (రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్) పేరు పెట్టీ గాంధీజీ నీ అవమానించాలని చూసే కుట్ర. నరేగా పథకాన్ని RSS స్కీమ్ గా మార్పు చేస్తున్నారు.

MGNREGA పథకానికి ఉన్నఫళంగా పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది ? 100 రోజుల పని దినాల నుంచి 125 రోజుల పెంపునకు గాంధీజీ పేరు మారుస్తారా ? మహాత్మా పేరు చెరిపేస్తే ఖర్చు తప్పా.. మోడీ గారికి దక్కే లాభం ఏంటి ? స్వాతంత్ర్య సమరయోధుల మీద,ఈ దేశ మాజీ ప్రధానుల మీద బీజేపీకి ఎందుకంత కోపం ? నరేగా పథకానికి పూజ్య బాపూజీ పేరు మార్చాలని చూసే కేంద్రం ప్రయత్నాలను తిప్పికొట్టాలి. దేశం మొత్తం మోడీ గారి తీరును ప్రతిఘటించాలి. రాష్ట్ర ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించాలి...అని షర్మిల పేర్కొన్నారు.

Next Story