రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం: ఎన్నికల ఫలితాలపై షర్మిల రియాక్షన్‌

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు.

By అంజి  Published on  5 Jun 2024 12:32 PM IST
YS Sharmila, Andhra Pradesh, election results

రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం: ఎన్నికల ఫలితాలపై షర్మిల రియాక్షన్‌

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆకాంక్షించారు.

''మనకు ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి. రాజధాని నిర్మాణం జరగాలి. నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలి. సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలి. ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజారిటీతో ముందుకు ఎలా అడుగు వేయాలో.. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి, ప్రత్యేక హోదా కోసం కట్టుబడితేనే, అన్ని విభజన హామీలకు కట్టుబడితేనే, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం'' అని షర్మిల ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ, ఇక మీద కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుందని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడుతుందన్నారు.

Next Story