'నేను రాజన్న బిడ్డను గుర్తు పెట్టుకో'.. సజ్జలపై షర్మిల తీవ్ర ఆగహం

వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు. '

By అంజి  Published on  8 April 2024 8:46 AM IST
YS Sharmila, YCP ,Sajjala Ramakrishna Reddy, APnews

'నేను రాజన్న బిడ్డను గుర్తు పెట్టుకో'.. సజ్జలపై షర్మిల తీవ్ర ఆగహం

వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు. ''నన్ను పెయిడ్‌ ఆర్టిస్టు అంటావా? నేను రాజన్న బిడ్డను గుర్తుపెట్టుకో.. అధికార మదం తలకు ఎక్కిందా? మతి ఉండే మాట్లాడుతున్నావా? నువ్వూ.. నీ కొడుకు పేమెంట్‌ తీసుకుని నన్ను, సునీతను హింసించారు. సోషల్‌ మీడియాలో హేళన చేశారు. మీ ఇంట్లో ఆడవాళ్లు కూడా పెయిడ్‌ ఆర్టిస్టులేనా?'' అని షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతకుముందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షర్మిల.. హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్న వారికి వైసీపీ టికెట్లు ఇచ్చిందన్నారు.

''తెలంగాణ నుంచి వచ్చానని మా మేనమామ అంటున్నారు. అక్కడ కేసీఆర్‌ను ఓడించాం.. మా పని అయిపోయింది. ఏపీలో నా పని ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చాను. వివేకాను హత్య చేసిన వాళ్లు యథేచ్ఛగా తిరుగుతున్నారు. అన్ని ఆధారాలు ఉన్నా చర్యలు లేవు. నిందితుడికే జగన్‌ మళ్లీ టికెట్‌ ఇచ్చారు. హత్య చేసిన వాళ్లను గెలిపించాలని చూస్తున్నారు. ఒక వైపు వైఎస్‌ఆర్‌ బిడ్డ.. మరో వైపు వివేకాను హత్య చేసిన నిందితుడు. వైఎస్‌ఆర్‌ మాదిరిగా ప్రజలకు అందుబాటులో ఉంటా ఆశీర్వదించి.. ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించండి'' అని అన్నారు. వైసీపీ పాలనలో హత్యలు,దోపిడీలు పెరిగిపోయాయని షర్మిల అన్నారు.

Next Story