సీఎం జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సెటైర్లు
తాజాగా మరోసారి వైఎస్ షర్మిల సీఎం జగన్‌పై సెటైర్లు వేశారు.
By Srikanth Gundamalla Published on 6 March 2024 3:00 PM ISTసీఎం జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సెటైర్లు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వైఎస్ షర్మిల పార్టీ బలోపేతం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఉన్న అందరు నేతలతో సమన్వయం చేసుకుంటూ పర్యటనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముందుగా సొంత అన్న సీఎం జగన్‌పై ఎలా మాట్లాడుతుంది..? విమర్శలు చేస్తారా లేదా? అనుకున్న తరుణంలో ఆమె ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మరోసారి వైఎస్ షర్మిల సీఎం జగన్‌పై సెటైర్లు వేశారు.
ఇటీవల సీఎం జగన్ 'విశాఖ విజన్' పేరుతో కార్యక్రమం నిర్వహించారు. విశాఖను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. అలాగే మరోసారి తాము అధికారం చేపట్టగానే ఇక్కడి నుంచే పాలన చేస్తామనీ అన్నారు. అంతేకాదు.. విశాఖలోనే తాను ప్రమాణస్వీకారం చేస్తానని కూడా చెప్పారు. ఈ కామెంట్స్‌పైనే తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. విశాఖ విజన్ పేరుతో సీఎం జగన్ ప్రకటనపై ఆమె సెటైర్లు వేశారు. పరిపాలనా రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చిందంటూ నిలదీవారు. ఎన్నికల ముందు పదేళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు చేస్తున్నారంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా షర్మిల ఒక పోస్టు కూడా పెట్టారు.
పరిపాలనా రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను సీఎం జగన్ మోసం చేస్తున్నారని వైఎస్ షర్మిల అన్నారు. అది మీ చేతకాని కమిట్‌మెంట్ అని చెప్పారు. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు ఏపీని వదిలి వెళ్లిపోతున్నా పట్టించుకోలేదంటూ మండిపడ్డారు. ఆంధ్రుల తలమానికం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షకపాత్ర వహించడం సీఎం జగన్ విజన్ అని సెటైర్లు వేశారు. రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం పాటించడం మీకు ప్రాక్టికల్ అంటూ కామెంట్ చేశారు.
పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది?
— YS Sharmila (@realyssharmila) March 6, 2024
పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్‌మెంట్. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాప్. ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్ ను కేంద్రం…