దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అందరికీ పండగ రోజని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ''కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాయి. ప్రజా శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా కృషి చేస్తాం'' అని పేర్కొన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాలలో ముందుకు సాగుతున్నారని పోస్ట్ చేశారు. మరోవైపు ఇడుపులపాయలోని వైస్ ఘాట్ వద్ద తన భార్య భారతితో కలిసి జగన్ నివాళి అర్పించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్‌ఆర్ సమాధికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల నివాళులు అర్పించారు. లీడర్ అంటే ఎలా ఉండాలో చూపించిన నాయకుడు వైఎస్ అని మీడియాతో అన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి గొప్ప పరిపాలన అందించారని గుర్తు చేశారు. షర్మిల వెంటతల్లి విజయమ్మతో పాటు భర్త అనిల్ కుమార్, కూతురు, కొడుకు, కోడలు ఉన్నారు.