125 అడుగుల అంబేద్కర్ విగ్రహం శిలా ఫలకం ధ్వంసం.. వైఎస్‌ జగన్‌ పేరు తొలగింపు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో సామాజిక న్యాయంకు నిదర్శనంగా నిర్మించిన 125 అడుగుల ఎత్తైన డిఆర్ అంబేద్కర్ విగ్రహం శిలా ఫలకాన్ని శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

By అంజి  Published on  10 Aug 2024 4:45 AM GMT
YS Jagan Mohan Reddy, BR Ambedkar statue, Andhra Pradesh

125 అడుగుల అంబేద్కర్ విగ్రహం శిలా ఫలకం ధ్వంసం.. వైఎస్‌ జగన్‌ పేరు తొలగింపు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో సామాజిక న్యాయంకు నిదర్శనంగా నిర్మించిన 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం శిలా ఫలకాన్ని శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో వివిధ దళిత సంఘాల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును శిలాఫలకం నుంచి తొలగించడం గమనార్హం. సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిన ఈ విగ్రహాన్ని ఈ ఏడాది జనవరిలో జగన్ ఆవిష్కరించి, ప్రజల సందర్శనార్థం ప్రారంభించారు.

చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని అధికార ప్రభుత్వం విగ్రహానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) ఆరోపించింది. వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఈ చర్యను ఖండించారు. గతంలో నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విగ్రహాన్ని స్థాపించడాన్ని వ్యతిరేకించారు. నాయుడు ప్రస్తుత పాలనలో కూడా ఇదే విధమైన దాడి జరిగిందని, దానిని అతను తీవ్రంగా ఖండించదగినదిగా పేర్కొన్నాడు.

ఈ ఘటన వెనుక ప్రభుత్వ అండదండలున్నట్లు అనిపిస్తోందని నాగార్జున ఉద్ఘాటించారు. ఇదిలావుండగా, ఇటీవలి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) హింసకు, అక్రమాలకు పాల్పడుతోందని నందిగామ మాజీ ఎంపీ సురేష్ ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు.

Next Story