మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది జగన్ సర్కార్. ఈ క్రమంలో వారి రక్షణ కోసం మరో 163 దిశ పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. బుధవారం వీటిని సీఎం జగన్ అసెంబ్లీ ప్రాంగణం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. 1.16 కోట్ల మంది మహిళలు దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపారు.
రాష్ట్రంలోని మహిళలపై అన్యాయం జరిగితే.. చూస్తూ ఊరుకోమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్లలో 900 ద్విచక్రవాహనాలున్నాయని వివరించారు. వీటితో పాటు 3 వేలకు పైగా ఎమర్జెన్సీ వాహనాలను ప్రారభించనున్నట్లు సీఎం జగన్ చెప్పారు. ఈ రోజు సీఎం ప్రారంభించిన వాహనాలు జీపీఎస్ ద్వారా కంట్రోల్ రూమ్‌కి అనుసంధానమై ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగితే పట్టణాల్లో 4 నుంచి 5 నిమిషాల్లో, గ్రామాల్లో 8 నుంచి 10 నిమిషాల్లో దిశ సిబ్బంది స్పందించనున్నారు. ఈ వాహనాల కోసం రూ.13.85 కోట్లు ఖర్చు చేశారు. అలాగే.. మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా విశ్రాంతి గదులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.5.5 వ్యయం చేశారు.