ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. జగన్ కోసం ఏమైనా చేస్తామనే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలని చాలా మంది కాంక్షిస్తున్నారు కూడా. అయితే తాజాగా సీఎం జగన్‌పై అభిమానంతో ఓ యువకుడు హైదరాబాద్ నుంచి బైక్ యాత్ర ప్రారంభించాడు. వచ్చే ఎన్నికలలో వైఎస్ జగన్ ప్రజలు మళ్లీ పట్టం కట్టాలని ఆకాంక్షిస్తూ యువకుడు బైక్ యాత్ర చేస్తున్నాడు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు వీరాభిమాని అయిన వీరబాబు మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన తాను దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా నాలుగేళ్లలో బీటెక్ పూర్తి చేశానన్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరానని చెప్పాడు. వైఎస్‌ఆర్ తనయుడు సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానంతో హైదరాబాద్ నుంచి విజయనగరం వరకు బైక్ యాత్రను ప్రారంభించానని తెలిపాడు.
ఈ యాత్ర ప్రతి రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. రోజుకు 100 నుండి 120 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు. రాత్రి ఎక్కడో ఒక లాడ్జిలో ఉంటూ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కింద నైట్ షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నానన్నాడు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలకు ఆదరణ ఉందని, అందుకే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ బైక్ యాత్ర చేపట్టానని వీరబాబు అన్నాడు. సీఎంగా మళ్లీ వైఎస్ జగన్‌ను ఆదరించాలని తాను ప్రయాణం చేస్తున్న జిల్లాలలో ప్రచారం చేస్తున్నాడు.