వాటర్ ట్యాంక్ ఎక్కి యువతి హల్‌చల్.. ప్రేమించిన వ్య‌క్తితో పెళ్లిచేయండి..లేదంటే

Young Woman climb water tank in Palakollu.ప్రేమించిన వ్య‌క్తితో పెళ్లి చేయాల‌ని ఓ యువ‌తి వాట‌ర్ ట్యాంకు ఎక్కింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Aug 2021 10:28 AM IST
వాటర్ ట్యాంక్ ఎక్కి యువతి హల్‌చల్.. ప్రేమించిన వ్య‌క్తితో పెళ్లిచేయండి..లేదంటే

ప్రేమించిన వ్య‌క్తితో పెళ్లి చేయాల‌ని ఓ యువ‌తి వాట‌ర్ ట్యాంకు ఎక్కింది. వివాహం చేయ‌కుంటే.. ఆ వాటర్ ట్యాంకు మించి దూకేస్తాన‌ని బెదిరించింది. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని పాల‌కొల్లులో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే.. బెత్లహంపేటకు చెందిన కేశవాణి తన మేనమామ కుమారుడైన యడ్ల భాస్కర్‌ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కాగా.. రెండు రోజుల క్రితం కేశ‌వాణి పెళ్లి ప్ర‌స్తావ‌న తీసుకుని రాగా.. భాస్క‌ర్ నిరాక‌రించాడు. దీంతో కేశ‌వాణి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

అయిన‌ప్ప‌టికి స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు. దీంతో బెత్ల‌హంపేట‌లోని వాట‌ర్ ట్యాంకు ఎక్కింది. భాస్క‌ర్‌తో పెళ్లి చేస్తేనే కింద‌కు దిగుతాన‌ని.. లేదంటే ఇక్క‌డి నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని కుటుంబ స‌భ్యుల‌కు వాట్స‌ప్ ద్వారా పంపింది. ఆందోళ‌న చెందిన కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు యువ‌తితో మాట్లాడారు. అక్క‌డ‌కు భాస్క‌ర్‌ను పిలిపించి అత‌డితో మాట్లాడారు. అనంత‌రం మ‌రోసారి యువ‌తితో మాట్లాడారు. యువ‌తి కింద‌కు దిగ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కౌన్సిలింగ్ అనంత‌రం వారిద్ద‌రికి స‌మీపంలోని ఓ ఆల‌యంలో వివాహం చేశారు.

Next Story