వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ శనివారం నాడు 3 రాజధానులకు మద్దతుగా శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీ వ్యతిరేకించిన మూడు రాజధానులకు మద్దతివ్వాలని వైసీపీకి చెందిన కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే విశాఖపట్టణంలో వికేంద్రీకరణకు మద్దతుగా జరుగుతున్న జేఏసీ సమావేశంలో స్పీకర్ ఫార్మాట్‌లో రిజైన్ లెటర్‌ను జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్‌కు అందజేశారు.
'విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు మద్దతుగా నేను స్పృహతో రాజీనామాను సమర్పిస్తున్నాను' అని అసెంబ్లీ స్పీకర్‌కు ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. దమ్ముంటే వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేయాలని టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడికి ధర్మశ్రీ సవాల్ విసిరారు. అమరావతికి మద్ధతుగా నిలుస్తూ టెక్కిలి నుంచి అచ్చెన్నాయుడు తిరిగి పోటీ చేయాలని ధర్మశ్రీ సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే విశాఖలో వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు జేఏసీ ప్రకటించింది.