హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన ఓ వివాదాస్పద వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగస్టు 4 న ఎంపీ మాధవ్ ఒక మహిళతో నగ్నంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై మాధవ్ స్పందించారు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. గతంలో ఎంపీపై అత్యాచారం కేసులు నమోదు కావడం గమనార్హం. ఇది ఫేక్ వీడియో అని, తాను జిమ్ చేసేప్పటి వీడియోను మార్ఫింగ్ చేశారని పేర్కొన్నారు.
తన పరువు తీసేందుకే ప్రతిపక్ష పార్టీ నేతలు ఈ కుట్రకు పాల్పడ్డారని మాధవ్ ఆరోపించారు. దీనిపై ఇప్పటికే జిల్లా ఎస్పీ, సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై ప్రెస్ కౌనిల్స్, హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు. వీడియో వైరల్ అయిన వెంటనే, ప్రతిపక్ష పార్టీ నాయకులు వైసీపీ ఎంపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కోరారు. విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు.
ఎంపీ మాధవ్‌పై వచ్చిన అసభ్య వీడియోకు సంబంధించి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మధావ్ వ్యవహారంపై సీఎంతో చర్చించిన తర్వాత సజ్జల మాట్లాడారు. ఎంపీ మాధవ్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందన్నారు. మార్ఫింగ్ వీడియోపై పోలీసు విచారణ సాగుతోందని, అది మార్ఫింగ్ వీడియో కాదని తెలిస్తే.. అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలను కించపరిచేలా ఎవరైనా వ్యవహారిస్తే పార్టీ సహించదని సజ్జల అన్నారు.