ఆర్టీసీ బస్సు నడిపిన కొడాలి నాని.. వీడియో

YCP MLA Kodali Nani driving palle velugu bus in Gudivada. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని రూటే సపరేటు. ఆయన ఏం చేసినా క్షణాల్లో

By అంజి  Published on  16 Feb 2023 1:45 PM IST
ఆర్టీసీ బస్సు నడిపిన కొడాలి నాని.. వీడియో

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని రూటే సపరేటు. ఆయన ఏం చేసినా క్షణాల్లో వైరల్‌గా మారిపోతుంది. ప్రతిపక్షాలపై ఆయన విసిరే పంచ్‌ డైలాగ్‌లు ఎప్పుడూ వైరల్‌ అవుతుంటాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్‌గా కొడాలి నాని విమర్శల వర్షం కురిపిస్తుంటారు. మంత్రి పదవి పోయిన తర్వాత కాస్త సైలెంట్‌ అయిన నాని.. ఇప్పుడు మళ్లీ దూకుడు పెంచారు. తాజాగా కొడాలి నాని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అవతారం ఎత్తారు. ఎమ్మెల్యే నాని బస్సు నడిపిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా గుడివాడ ఆర్టీసీ డిపో పరిధిలో కొత్తగా ఐదు బస్సులను ప్రారంభించారు.

ఎమ్మెల్యే కొడాలి నాని చేతుల మీదుగా ఈ బస్సులను ప్రారంభించారు. అదే సమయంలో కొడాలి నాని తనకున్న హెవీ వెహికల్ డ్రైవింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. గుడివాడ పట్టణ ప్రధాన రహదారుల్లో పల్లెవెలుగు బస్సును నడిపారు. నిజంగానే చాలా అనుభవం ఉన్న డ్రైవర్‌లా సునాయాసంగా బస్సును నడిపారు. బస్సును స్వయంగా నడిపి అక్కడున్న అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద దళిత సోదరుల బస్సులను ప్రారంభించడం సంతోషంగా ఉందని కొడాలి నాని చెప్పారు. దళిత వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.


Next Story