తల తెగినా సరే.. జగనన్న కోసం ముందుకెళ్తా: ఎమ్మెల్యే అనిల్‌ కుమార్

మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తల తెగుతుందన్నా సరే.. జగనన్న కోసం ముందుకెళ్లి నిలబడతానన్నారు.

By అంజి  Published on  21 Feb 2024 12:12 PM IST
YCP, MLA Anil Kumar Yadav, APnews, NarasaRaopet

తల తెగినా సరే.. జగనన్న కోసం ముందుకెళ్తా: ఎమ్మెల్యే అనిల్‌ కుమార్

మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తల తెగుతుందన్నా సరే.. జగనన్న కోసం ముందుకెళ్లి నిలబడతానే తప్ప వెనుకడుగు వేయనని అన్నారు. జగన్‌ కోసం తల తెంచుకుంటానే తప్ప.. తల వంచనని అన్నారు. జగన్ కోసం రామ బంటులా పని చేస్తానని చెప్పారు. నరసరావుపేట ఎంపీగా గెలిచాక ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని తెలిపారు. పల్నాడు గడ్డ ప్రజలు తనను అక్కున చేర్చుకోవడంతో నెల్లూరు వదిలి వచ్చినప్పుడు కలిగిన బాధ పోయిందన్నారు. జగన్‌ ఒక్కడిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని విమర్శించారు. ఒక్కడిని ఓడించడానికి ఐదుగురు కలిసి వస్తున్నారని విమర్శించారు.

అనిల్ కుమార్ యాదవ్‌ను నరసరావు పేట ఎంపీ అభ్యర్థిగా అధికార వైఎస్ఆర్ సీపీ అధిష్ఠానం నియమించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జిలను నియమించే ప్రక్షాళనలో భాగంగా ఎమ్మెల్యే అనిల్ యాదవ్‌ను పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా కొద్ది వారాల క్రితం ఖరారు చేసింది వైసీపీ. తాజాగా వినుకొండలో ఏర్పాటు చేసిన సభలో అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పార్లమెంట్ పరిధిలోని ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్లి అందర్నీ వ్యక్తిగతంగా కలుస్తానని అన్నారు.

Next Story