వైసీపీ నేతలు జైలుకు పోవడం ఖాయం: బీజేపీ ఎమ్మెల్యే

గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు అందరూ జైలుకెళ్లడం ఖాయమని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు.

By అంజి  Published on  4 Aug 2024 4:15 PM IST
YCP leaders, BJP MLA Adinarayana Reddy, APnews

వైసీపీ నేతలు జైలుకు పోవడం ఖాయం: బీజేపీ ఎమ్మెల్యే

గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు అందరూ జైలుకెళ్లడం ఖాయమని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు. ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు దోచేశారని ఆరోపించారు. విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో జగన్‌ను ఓడిస్తామన్నారు. 200 సీట్లు గెల్చుకుని ఏన్డీఏ కూటమి క్లీన్‌ స్వీప్‌ చేస్తుందన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అభవృద్ధి వెనకబడిందన్నారు. ప్రజలు వైసీపీ తిరస్కరించారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు పరిపాలన బాగా చేస్తున్నారన్న ఆదినారాయణరెడ్డి.. మోదీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని వ్యాఖ్యానించారు.

వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాబోతున్నాయని, సంక్షేమ పథకాలు వంద శాతం అమలు చేస్తామని తెలిపారు. పోలవరం బాధ్యత తమదే అని కేంద్రం చెప్పిందన్నారు. అమరావతికి రూ.15 వేల కోట్లు కేటాయించారని వివరించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రూ.5 లక్షల కోట్లు దోచేశారని ఆరోపించారు. జగన్‌ పాలనలో ఏనాడూ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేదన్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. సీఎం చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టగానే ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చారని తెలిపారు.

Next Story