చీరాల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ సోమవారం సాయంత్రం పొట్టిసుబ్బయ్యపాలెం సమీపంలోని రొయ్యల ఫ్యాక్టరీలో నడుచుకుంటూ వెళ్తుండగా పాముకాటుకు గురయ్యారు. అతని అనుచరులు వెంటనే అతన్ని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయగా, తదుపరి చికిత్స నిమిత్తం విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మణిపాల్ ఆస్పత్రికి చేరుకుని ఆమంచి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ఆమంచి కృష్ణ మోహన్ గతంలో చీరాల ఎమ్మెల్యేగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మొదట 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ప్రస్తుతం ఆయన పర్చూరు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు ఇటీవల జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.