ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ
YCP declares MLC candidates.త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ పార్టీ తమ
By తోట వంశీ కుమార్ Published on 25 Feb 2021 11:12 AM GMTత్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. అభ్యర్థుల పేర్లను వైసీపీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిని నిలబెట్టడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇటీవల మృతి చెందిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, చల్లా రామకృష్ణారెడ్డి కుమారులకు అవకాశం కల్పించారు.
చిత్తూరు జిల్లా నుంచి బల్లి కళ్యాణ్ చక్రవర్తికి అవకాశం ఇచ్చారు. ఈయన ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కుమారుడు. కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మరణంతో ఆయన కుమారుడు చల్లా భగీరథరెడ్డికి అవకాశం కల్పించారు. ఇక విజయవాడ నుంచి కార్పొరేటర్ మహ్మద్ కరీమున్నీసా ఛాన్స్ ఇచ్చారు. గతంలో కరీమున్నీసా విజయవాడ సెంట్రల్‌లో 56వ కార్పొరేటర్‌గా పనిచేశారు. అదే విధంగా శ్రీకాకుళం జిల్లా నుంచి దువ్వాడ శ్రీనివాస్‌కు, సీనియర్ నేత సీ రామచంద్రయ్యకు అవకాశం కల్పించింది.
మార్చి 29తో నలుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామాతో ఏర్పడిన స్థానంతో పాటు, చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఏర్పడిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఖాళీ కానున్న తిప్పేస్వామి, సంధ్యారాణి, వీరవెంకటచౌదరి, షేక్ అహ్మద్ ఇక్బాల్ స్థానాలకు మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు
చల్లా భగీరథరెడ్డి
బల్లి కల్యాణ చక్రవర్తి
సి.రామచంద్రయ్య
మహ్మద్ ఇక్బాల్
దువ్వాడ శ్రీనివాస్
కరీమున్నీసా